హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు INDIANDEALSHUB.
ఈరోజు నేను మీకు లాప్టాప్ కొనేముందు ఎలాంటి స్పెసిఫికేషన్స్ చూసుకోవాలి. అలాగే ఆ లాప్టాప్ మన బడ్జెట్ లో ఉందా లేదా ?. ఆ ల్యాప్టాప్ మన వర్క్ కి సెట్ అవుతుందా లేదా ? . ఏ లాప్టాప్ ని కొనాలి అనే విషయాన్ని మీకు చెప్పబోతున్నాను.
మరి లేట్ ఎందుకు తెలుసుకుందాం పదండి.
ముఖ్యంగా లాప్ టాప్ ని మనం ప్రాసెసర్ని ఆధారం చేసుకుని కొంటాం. మనకు బయట వినబడే పేర్లలో ఎక్కువగా వినిపించే పేర్లు INTEL మరొకటి AMD.
INTEL లో i- Series పాపులర్ అయితే, AMD లో Ryzen- Series బాగా పాపులర్.
మన వర్క్ నేచర్ నీ ఆధారంగా తీసుకుని ల్యాప్టాప్ను మూడు రకాల కేటగిరీలుగా ఎంచుకోవచ్చు అందులో
మొదటిది బేసిక్,
రెండవది మోడరేట్,
మూడవది అడ్వాన్స్.
- బేసిక్ USAGE గురించి మాట్లాడుకుంటే INTEL లో అయితే i3 అలాగే AMD లో అయితే Ryzen -3 నీ ఎంచుకోవచ్చు ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే INTEL i3 ప్రాసెసర్ ని ఎంచుకోవడం మంచి ఎంపిక అవుతుంది. ఇలాంటి లాప్టాప్స్ మనకు 30 నుండి 40 వేల లోపల లభిస్తాయి. ఈ ల్యాప్టాప్ లో మీరు బ్రౌజింగ్ అలాగే డాక్యుమెంట్ క్రియేషన్ మరియు ఆన్లైన్ క్లాసులు నేర్చుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ లేదా గేమ్ ఆడటం కోసం అయితే ఈ లాప్టాప్ ని ఎంచుకో కండి.
- మోడరేట్ యూసెస్ గురించి మాట్లాడుకుంటే INTEL లో అయితే i5 అలాగే AMD లో అయితే Ryzen -5 ని ఎంచుకోండి. ఈ లాప్టాప్ లో మనం బేసిక్ లాప్టాప్ లో చేసే వాటితో పాటు చిన్న చిన్న వీడియో ఎడిటింగ్ అలాగే తక్కువ గ్రాఫిక్స్ ఉన్నా గేమ్స్ ఆడుకోవచ్చు. ఈ లాప్టాప్ ని కోడింగ్ కోసం చక్కగా వాడుకోవచ్చు. వీటి ధర 40 నుండి 55 వేల మధ్య ఉంటుంది. ఒకవేళ మీరు గేమ్స్ ఆడడానికి ఈ లాప్టాప్ ని ఎంచుకోవాలి అనుకుంటే ఇందులో గ్రాఫిక్ కార్డ్ ఉన్న లాప్టాప్ ని ఎంచుకోండి. ఒకవేళ మీకు గ్రాఫిక్స్ కార్డు తో పాటు కావాలి అంటే 50 నుండి 65 వేల మధ్యలో ఈ ప్రాసెసర్ ఉన్న లాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి.
- ఒకవేళ మీరు అడ్వాన్స్డ్ యూసేజ్ కోసం అయితే, INTEL లో అయితే i7 అలాగే AMD లో అయితే Ryzen-7 లేదా Ryzen-9 ప్రాసెసర్ ఉన్న లాప్టాప్ ని ఎంచుకోండి. అలాగే మంచి గ్రాఫిక్స్ కార్డు ఉన్న లాప్టాప్ ని ఎంచుకోవడం వల్ల మీరు ఈ లాప్టాప్ ని ఉపయోగించి వీడియో ఎడిటింగ్ అలాగే హెవీ గ్రాఫిక్స్ ఉన్న గేములు ఆడటానికి ఉపయోగపడుతుంది. ఈ లాప్టాప్ ని కూడా కోడింగ్ కోసం వాడుకోవచ్చు. అలాగే ఈ లాప్టాప్స్ 65 వేల నుండి లక్షా ఇరవై వేల మధ్య అందుబాటులో ఉన్నాయి.
Note: అలాగే Premium ల్యాప్ టాప్స్ లక్ష నుండి రెండు లక్షల మధ్యలో కూడా లభిస్తాయి.
మనం మన అవసరాన్ని బట్టి మన లాప్టాప్ ఎంచుకోవటం చాలా తెలివైన పని.
Pro Tips:
- లాప్టాప్ లో హార్డ్ డిస్క్ అనేది SSD ఉండేలా చూసుకోండి
- ల్యాప్టాప్ జనరేషన్ లేటెస్ట్ గా ఉండేలా చూసుకోండి
- లాప్టాప్ RAM కనీసం 8 G.B ఉండేలా చూసుకోండి
- లాప్టాప్ రివ్యూ మంచిగా ఉన్న లాప్టాప్ ని ఎంచుకోండి
మీకోసం కేటగిరి వైస్ కొన్ని లాప్టాప్స్ కింద పొందుపరచడం జరిగింది.